తమ తీర్పు వచ్చేవరకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేయెద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. కాగా వైఎస్ వివేకా హత్య కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ అవినాశ్ దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారించింది. అవినాశ్ ఆధారాలను ధ్వంసం చేశాడని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఆయన అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తమ తీర్పు వచ్చేవరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.