నేను చెప్పేదాకా నమ్మొద్దు: రష్మిక మంధాన

విజయ్ దేవరకొండతో డేటింగ్ ప్రచారంపై రష్మిక మంధాన స్పందించారు. ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో ‘రష్మిక’పై విజయ్‌ దేవరకొండ అభిప్రాయం అడగ్గా ‘డార్లింగ్‌’ అంటూ సంభోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ మీడియా రష్మికను ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. ‘మీరు నా సినిమాల కన్నా నా బాయ్ ఫ్రెండ్, డేటింగ్ వంటి అంశాలే ఎక్కువగా అడుగుతున్నారు. కానీ నా నోటితో నేను చెప్పేంతవరకు ఎలాంటి ఎఫైర్‌ వార్తలను సీరియస్‌గా తీసుకోవద్దు. ఆ వార్తలతో ఎంజాయ్‌ చేసేవాళ్లను చేయనివ్వండి’ అంటూ సమాధానమిచ్చింది.

Exit mobile version