సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల 5జీ నెట్వర్క్ అప్‌గ్రేడ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.” త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు పొందేందుకు మీ 3జీ, 4జీ సిమ్‌ను 5జీ సిమ్గా మార్చేందుకు కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి” అంటూ మోసపూరిత SMSలు వస్తున్నట్లు చెప్పారు. అలాంటి లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించారు. బాధితులు ఎవరైనా ఉంటే 1930కి కాల్ చేయాలని తెలిపారు.
ఆ లింక్స్ క్లిక్ చేయొద్దు: సైబర్ క్రైమ్

Courtesy Twitter: telangana cyber crime