సమస్య వస్తే కుంగిపోవద్దని హీరో రానా సూచించాడు. తాను కూడా కొన్ని శారీరక సమస్యలను అనుభవించినట్లు చెప్పారు. ఈ క్రమంలో తనకు జరిగిన శస్త్రచికిత్సలపై రానా స్పందించాడు. తానో టెర్మినేటర్ అంటూ అభివర్ణించాడు. చిన్నప్పుడు కుడి కంటికి సమస్య ఉండేది. దీంతో కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పాటు కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. దానికీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. చాలామంది శారీరక సమస్యలు వస్తే బాధపడతారు. అది నయమైనా దాని నుంచి బయటకు రాలేరు. అలాంటి ఆలోచనల నుంచి బయటపడాలి’ అని రానా సూచించాడు.