కామారెడ్డి జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. కొత్త మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనకు దిగారు. తమ భూములను ఇండస్ట్రీయల్ గ్రీన్ జోన్‌లో పెట్టడంపై ఆగ్రహించారు. ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది. కొందరు మహిళలు గాయపడ్డారు. తన భూమి ఇండస్ట్రీయల్ గ్రీన్‌జోన్‌లోకి పోతుందని రాములు అనే రైతు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కర్షకులు కన్నెర్ర చేశారు. కలెక్టర్ ఫొటోకు వినతిపత్రం ఇచ్చారు.