సీబీఐని రాష్ట్రాలకు రానివ్వొద్దు: కేసీఆర్

© ANI Photo

కేంద్ర దర్యాప్తు సంస్థ CBIకి ఇచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్రాలూ ఉపసంహరించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. CBI, ED వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కక్ష సాధింపుల కోసమే వీటిని వినియోగిస్తోందన్నారు. బిహార్‌ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. చట్టం ప్రకారం సీబీఐ ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే బంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, పంజాబ్‌, మేఘాలయా సహా 9 రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. తాజాగా కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Exit mobile version