AP: మత్య్స శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వారిని ఉత్తరాంధ్రలో తిరగనివ్వొద్దని ఆయన ఆరోపించారు. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే మోసపూరిత వాగ్ధానాలను నమ్మొద్దని మంత్రి అప్పలరాజు సూచించారు. ‘మనమందరం ఒకతాటిపైకి వచ్చి విశాఖను రాజధానిగా చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉత్తరాంధ్రలో తిరగనివ్వొద్దు. టీడీపీ హయాంలో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తులేదు. ఎన్నికలు ఉన్నాయి గనుక ఉత్తరాంధ్ర కావాలి. ఇదంతా రాజకీయాల్లో భాగమే’ అని ఆయన స్పష్టం చేశారు.