రాష్ట్రంలో బ్యాంకు రుణాలు ఎవరూ కట్టొద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. అందుకే ఎవరూ బ్యాంకుల్లో రుణాలు కట్టొద్దు. ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. బీఆర్ఎస్, బీజేపీ అవిభక్త కవలలు. ఆ రెండు పార్టీలు ఒకటే. ఆ రెండు పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి.’’ అంటూ పిలుపునిచ్చారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్