క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ బాలుడు తన వ్యాధి గురించి తల్లిదండ్రులకు చెప్పొద్దంటూ వైద్యుడికి చెప్పిన మాటలు హృదయాల్ని కదిలిస్తాయి. హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ చేసిన ఈ పోస్ట్ కన్నీళ్లు పెట్టిస్తుంది. “ ఒకరోజు ఓపీ చేస్తుండగా యువ దంపతులు నా వద్దకు వచ్చారు. తమ కుమారుడికి క్యాన్సర్ ఉంది వాడికి చెప్పొద్దని కోరారు. తర్వాత అబ్బాయి లోపలికి వచ్చాడు. కొద్దిసేపటికి తల్లిదండ్రులను బయటకి వెళ్లమన్నాడు. నేను 6 నెలలకంటే ఎక్కువ బతకను అని తెలుసు. ఈ విషయం అమ్మనాన్నలకు చెప్పొద్దని చెప్పాడు. అది విన్నాక మాట రాలేదు” అన్నారు.