రానా, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతున్న సిరీస్ రానా నాయుడు. మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ వెంకటేశ్ గారి సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా టికెట్లు సంక్రాంతి పండగకు వెళ్లినట్లు వెళ్తారు. కానీ రానా నాయుడు సిరీస్ మాత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడకండి. విడి విడిగా చూడండి. కలిసి చూస్తే కంగారు పడతారు” అంటూ వ్యాఖ్యానించారు.