ముంబయిలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదానికి గురికావటంపై హీరోయిన్ ఆదాశర్మ స్పందించారు. “ యాక్సిడెంట్ అయిందని తెలియడంతో నా యోగక్షేమాల గురించి చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కేరళ స్టోరీ టీం అంతా బాగున్నాం. పెద్ద ప్రమాదమేమి కాదు, కంగారు పడాల్సిన పనిలేదు. మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు” అని ట్వీట్ చేశారు. కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉన్నా.. రోడ్డు ప్రమాదం కారణంగా హాజరు కాలేదు.
-
Screengrab Instagram:adahsharma
-
Screengrab Instagram:adahsharma