టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరుగుతున్న వన్డేలో ద్విశతకంతో చెలరేగాడు. 87 బంతుల్లో మెరుపు సెంచరీ చేసిన గిల్…145 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. 208 పరుగులు చేశాక చివరి ఓవర్లో గిల్ ఔటయ్యాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌లోనే గిల్ డబుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు.