తెలంగాణలో అధికారం సాధించి డబుల్ ఇంజిన్ సర్కార్ నెలకొల్పుతామని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో తోక పార్టీగా మిగిలిపోతుందని జోష్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ణాని అని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు అందరూ పదవులు పంచుకోవడమా అని ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయ ఢంకా మోగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.