బాలీవుడ్ సీనియర్ నటుడు సతీశ్ కౌశిక్ మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. 8న దిల్లీలోని ఓ ఫాంహౌస్‌లో నటుడు చనిపోగా, ఫాంహౌస్ యజమాని వికాస్ మాలు రెండో భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు, సతీశ్ కౌశిక్‌కు డబ్బు విషయంలో గొడవ జరిగిందని ఆరోపించారు. సతీశ్ నుంచి తీసుకున్న రూ.15 కోట్ల డబ్బు కరోనా కాలంలో పోగొట్టుకున్నానని తన భర్త చెప్పినట్లు తెలిపారు. వయాగ్రా ఔషధాలు, రష్యన్ గర్ల్స్ ద్వారా కౌశిక్ సమస్య పరిష్కరించుకుంటాని అన్నట్లు పోలీసులకు వివరించారు.