వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో కాస్త అధికంగా నీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, పడుకునే ముందు నీటిని తీసుకోవడం వల్ల మేలు కన్నా కీడు జరిగే అవకాశం ఉందట. కనీసం ఒక గంట ముందు నీరు తీసుకుంటే ఫర్వాలేదని, నీరు తాగిన వెంటనే పడుకోవడం శ్రేయస్కరం కాదని డైటీషియన్లు చెబుతున్నారు. పడుకునే ముందు నీరు తాగితే శరీరంలో వాపు వచ్చే ముప్పు ఉంటుందట. పైగా మూత్రాశయం నిండటం వల్ల నిద్రకు భంగం కలగొచ్చని చెబుతున్నారు. అయితే, ఒకసారి వైద్యుడిని సంప్రదించాక నీరు తాగడంపై నిర్ణయం తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.