దేశంలో డ్రోన్స్ వినియోగం విపరీతంగా పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది డ్రోన్ పైలట్ కోర్సులో కోచింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుతం ఈ కోర్సుకు అధికంగా ఫీజు ఉంది. దీంతో చాలా మంది యువత ఈ కోర్సును నేర్చుకుందామని భావించినా కానీ కుదరడం లేదు. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఈ కోర్సుల ఫీజులు తగ్గే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. అధికారుల ప్రమేయం లేకుండా డీజీసీఏనే ఈ ఇన్స్టిట్యూట్లకు అనుమతులు జారీ చేస్తోందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ఫీజులు భారీగా తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.