జగన్ అక్రమాస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చెక్కెదురైంది. బీపీ ఆచార్య, కృపానందంలు విడివిడిగా కోరిన అభ్యర్థనలను హైకోర్టు తోసిపుచ్చింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, అరబిందో హెటిరో ఛార్జిషీట్లో సీబీఐ మోపిన అభియోగాలను కొట్టివేయాలన్న బీపీ ఆచార్య వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. అలాగే, రఘురాం సిమెంట్స్ ఛార్జిషీట్ని కొట్టివేయాలని కృపానందం కోరగా కోర్టు తిరస్కరించింది. అప్పటి పరిశ్రమల కార్యదర్శిగా ఉన్న కృపానందం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బీపీ ఆచార్య అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని సీబీఐ ఛార్జిషీట్లలో పేర్కొంది.
విశ్రాంత ఐఏఎస్ అధికారులకు చుక్కెదురు

© File Photo