తెలంగాణలో ప్రభుత్వానికి వైద్యులకు మధ్య యుద్ధం నడుస్తోంది. కొంత మంది వైద్యులు ప్రైవేటు మెడికల్ షాపులతో కుమ్మక్కై.. మందుల కోసం పేదలకు ప్రైవేటు దుకాణాలకు పంపుతున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే సరైన మందులు లేకపోతే తామేం చేస్తామంటూ కొందరు జూడాలు, వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ పెంచినా మందులు సక్రమంగా సరఫరా కావడంలేదని చెబుతున్నారు. డీఎంఈ రమేశ్ రెడ్డి మంత్రి హరీశ్ రావును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.