డ్రగ్స్ కేసు: ‘సగం పబ్‌లు రాజకీయ నేతలవే’

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 61 పబ్‌లు ఉండగా దాదాపు 40 పబ్‌లను రాజకీయ నాయకులే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో 24 గంటలు పర్మిషన్ నోవాటెల్, రాడిసన్‌లకు మాత్రమే ఉన్నాయి. తాజా రాడిసన్ పబ్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పబ్‌ని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అల్లుడు కిరణ్‌ రాజు నిర్వహిస్తుండగా, జాతీయ పార్టీకి చెందిన ఓ వ్యక్తికి కూడ వాటా ఉన్నట్లు తెలుస్తుంది. తరచూ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కంప్యూటర్లలో నిక్షిప్తమైన డ్రగ్స్ ఎడిక్టర్ల జాబితాను మరిచిపోతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.

Exit mobile version