కొండాపూర్‌లో నిహాల్, లోహిత్ అనే ఇద్దరు యువకులు మద్యం తాగి బీఎండబ్ల్యూ కారుతో బైకును ఢీ కొట్టారు. స్థానికులు వారిని ఆపి పోలీసులకు అప్పగించగా డ్రంక్ డైవ్ కేసు నమోదుచేశారు. వారి కారుపై ఎంపీ స్టిక్కర్ కూడా ఉండటంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ఫోటోలు టీవీలో వస్తే రాకూడదు అంటూ మద్యం మత్తులో పోలిసులనే బెదిరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో నిహాల్‌కు 250 శాతం, లోహిత్‌కు 501 శాతం రీడింగ్ చూపించింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులు గాయపడగా వారిని జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.