చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో మార్చి 18న రాక్ విత్ రాజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కచేరి నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్‌కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా హాజరు కానున్నారు. ఈ మేరకు తను తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘నా కల నిజమైంది, మ్యూజిక్ ఇసైజ్ఞాని ఇళయరాజాతో కలిసి వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో మార్చి 18న నా గాడ్ ఆఫ్ మ్యూజిక్‌తో స్టేజ్‌ని షేర్ చేస్తున్నాను. మీరూ కూడా అక్కడే ఉండండి. రాజాతో కలిసి రాక్ చేద్దాం’ అంటూ ట్వీట్ చేశారు.