అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘ఇట్ల మారేడిమిల్లి ప్రజానీకం’ సినిమా ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ తొలిరోజే మిశ్రమ స్పందనను చూరగొంది. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో కలెక్షన్లు పెరుగుతాయని ఆశించినా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. మరోవైపు, ‘లవ్‌టుడే’ సినిమాకు మంచి స్పందన రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూడ్డానికే మొగ్గు చూపుతున్నారు. ఎమోషనల్ సోషల్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఏఆర్ మోహన్ తీర్చిదిద్దారు.