నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మేనియా మొదలైంది. యూట్యూబ్ చార్ట్స్‌లో ఈ సినిమా తొలి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, మ్యూజిక్ విభాగంలో చమ్కీల అంగీలేసి పాట నం.1 స్థానంలో ట్రెండ్ అవుతున్నాయి. అటు పాటకు, ఇటు ట్రైలర్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నాని ఉగ్రరూపం చూసిన ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సంతోష్ నారయణన్ మ్యూజిక్ అందించాడు. కీర్తి సురేష్ హీరోయిన్.