నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా పైలెట్ మిచెల్ గూరిస్ సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయారు. విమానం ల్యాండింగ్‌తో పాటు దానికి సంబంధించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పంచుకుంటూ పాపులారిటీ సంపాదించారు. 31 ఏళ్ల మిచెల్ పదేళ్లుగా పైలట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. తాను సందర్శించిన ప్రాంతాల విశేషాలను నెటిజన్లతో మిచెల్ పంచుకుంటోంది. ఈమెకు యూట్యూబ్‌లో 3.3 లక్షల మంది సబ్‌స్రైబర్లు ఉండగా, ఇన్‌స్టాలో 3.2 లక్షల మంది ఫాలో అవుతున్నారు.