బడా నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ హీరోగా తెరంగ్రేటం చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక మూవీ RRR విషయంలో కంటే దానయ్యకు తన తనయుడిని గ్రాండ్‌గా లాంచ్ చేయాలనే విషయంలోనే ఎక్కువ టెన్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. దానయ్య కొడుకును యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇంట్రడ్యూస్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో రాబోతున్న సినిమాకు అధిరా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని ఫిలింనగర్ టాక్. మరి దానయ్య కుమారుడికి ఈ సినిమాతో హిట్ వస్తుందో లేదో వేచి చూడాలి.