చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023లో జరిగే సీజన్ కోసం సీఎస్కే యాజమాన్యం ఈ ఆల్‌రౌండర్‌ని అట్టిపెట్టుకోలేదు. దీంతో ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి.. అదే జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. సీఎస్కే తరఫున బ్రావో మరచిపోలేని ప్రదర్శనలు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు(189) బ్రావో పేరిటే ఉంది. 2011లో చెన్నై జట్టులో బ్రావో చేరాడు. ఐపీఎల్ కెరీర్లో బ్రావో 169 మ్యాచ్‌లు ఆడగా అందులో 116 సీఎస్కే తరఫున ఆడినవే కావడం గమనార్హం. కాగా, కొత్త జర్నీ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు బ్రావో ప్రకటించాడు.