అర్ధరాత్రి పూట IAS అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి వెళ్లిన డిప్యూటి తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆనంద్ కుమార్ రెడ్డితో పాటు దుర్గారావు అనే మరోవ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉద్యోగం విషయమై మాట్లాడాలంటూ అర్ధరాత్రి నిందితుడు కలెక్టర్ ఇంట్లోకి వెళ్లాడు. ఆమె అరవడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.