భారత్‌లో స్వలింగ సంపర్కురాలిగా ప్రకటించుకున్న తొలి అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ద్యుతి చంద్ పెళ్లి చేసుకుందంటూ వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. ద్యుతిచంద్ తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలిసాతో లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలోనే చెప్పింది. అయితే తాజాగా వీరు పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ద్యుతి చంద్ తన ట్విట్టర్లో ఓ ఫోట్ షేర్ చేసి ‘నేను ప్రేమించా, ప్రేమిస్తున్నా, ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ ట్యాగ్ చేసింది. దీన్ని చూసి వారికి పెళ్లయిందనుకున్నారు. కానీ ఆ ఫోటో ద్యుతి చంద్ తన సోదరి పెళ్లిలో దిగినట్లు తెలుస్తోంది.
ప్రియురాలితో ద్యుతి చంద్ పెళ్లి!

Courtesy Twitter:dyuthi chand