సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రజలు వారి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్ దాదాపు సగం ఖాళీ అవుతుంది. చాలా ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. దీంతో నగరంలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ప్రాంతా ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు నేరగాళ్లపై డేగ కన్ను వేశారు. రాత్రి, పగలు గస్తీ నిర్వహిస్తున్నారు. నగరంలో ఎక్కడా దొంగతనాలు జరగకుండా పోలీసులు కృషి చేస్తున్నారు.