మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. అధికార శివసేన పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే తనతో 40 ఎమ్మెల్యేలు ఉన్నారని తిరగబడడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని శివసేన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దానికి ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ‘మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు అవుతుందేమో’ అని ట్వీట్ చేయడం, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఎంపీ ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ నుంచి ఎంపీ అని తొలగించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.