చలికాలంలో సాధారణంగానే శారీరక శ్రమ తగ్గుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలున్నాయి. అయితే, ఈ పండ్లు తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ, పైనాపిల్, జామ, నారింజ, అత్తిపళ్లు, యాపిల్ వంటి ఫలాలను తీసుకోవడం ద్వారా అధిక బరువు బారి నుంచి తప్పించుకోవచ్చట. రోజు వారీ డైట్‌లో వీటిని చేర్చుకుంటే ఫలితాలను చూడగలరని చెబుతున్నారు. శరీరాన్ని సమతా స్థితిలో ఉంచి.. మానసికంగానూ ఈ పండ్లు ఉల్లాసాన్ని కలిగిస్తాయని అంటున్నారు. అయితే, ఏ మోతాదులో తీసుకోవాలో సంబంధిత నిపుణులను సంప్రదిస్తే మేలని సూచిస్తున్నారు.