ప్రస్తుత కాలంలో మనం తినే ఆహరం విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు. జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటుండడంతో అధిక బరువు పెరగడం, ఊబకాయం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో బరువును ఎలా తగ్గించుకోవాలని, డైట్‌లు జిమ్‌లు అంటూ పడరాని పాట్లు పడుతుంటారు. అలాంటి వాళ్ళు వ్యాయామంతో పాటు సరైన ఆహారం తీసుకోవాలి. రోజు వారి ఆహారంలో ఆకుకూరలను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పాలకూర తింటే, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. దీంతో పాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. దీంతో పాటు శెనగలు తీసుకుంటే శరీరానికి తక్షణ ప్రోటీన్ అందడంతో పాటు ఇందులో ఉన్న ఫైబర్ వల్ల వెంటనే ఆకలి కాదు. అటు పెరుగు కూడా ఆహారంలో భాగం చేసుకుంటే తక్షణ ప్రోటీన్ అందడంతో పాటు.. పెరుగులో మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ వేగంగా జరగడంలో సహాయపడుతుంది.