పర్యావరణ పరిరక్షణలో భారత్ ప్రపంచ దేశాలన్నింటికంటే వెనకబడింది. ఎన్విరాన్ మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్-2022 ప్రకారం 180 దేశాల్లో ఇండియా చివరి స్థానంలో నిలిచింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్ వంటి దేశాల కంటే అట్టడుగు స్థానానికి భారత్ పడిపోయింది. న్యాయాన్ని అందించడం, అవినీతి నిర్మూలనలోనూ భారత్ చాలా వెనకబడిఉందని సూచీ తెలిపింది. డెన్మార్క్ ఈ సూచీలో తొలిస్థానంలో నిలిచింది.