నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 3 వారాలు గడువు కోరారు. బుధవారమే ఆమె ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. జూన్ 2న కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమె ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇదే కేసులో సమన్లు అందుకున్న రాహుల్ గాంధీ 13న ఈడీ ముందు హాజరవుతారు. రాహుల్ కు మద్దతుగా ఆ రోజు భారీ ర్యానీ నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రణాళికలు వేస్తున్నాయి.