కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఊరటనిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను వాయిదా వేయాలని సోనియా గాంధీ కోరగా.. అందుకు ఈడీ సానుకూలంగా స్పందించింది. సోనియా గాంధీ తనకు కరోనా వల్ల ఆరోగ్యం బాగాలేదని విచారణను వాయిదా వేయాలని కోరారు. విచారణను జూలై మధ్యనాటికి వాయిదా వేస్తూ ఈడీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో సోనియా కుమారుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ 50 గంటలకుపైగా విచారించింది.