దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఉదయం 11 గం. ప్రారంభమైన క్వశ్చన్ అవర్ సాయంత్రం దాటినా పూర్తి కాలేదు. ఏడున్నర గంటలుగా కవితను ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా అనూహ్యంగా ఆ సమయాన్ని అధికారులు పెంచారు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. కవిత బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని దిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.