ఈడీ అధికారులకు కవిత గైర్హాజరుపై పత్రాలు సమర్పించిన తర్వాత బీఆర్ఎస్ కార్యదర్శి సోమా భరత్ మీడియాతో మాట్లాడారు. కవిత తరఫున కొన్ని డాక్యుమెంట్లు ఈడీకి అందించాం. 11వ తేదీ విచారణలో నిబంధనలు ఉల్లంఘించారు. మహిళలను ఇంట్లోనే విచారించాలి అనే నిబంధనను ఈడీ పాటించలేదు. చట్టాన్ని కవిత గౌరవించారు. ఈడీ తప్పుడు కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది అని ఆరోపించారు.