ఎన్టీఆర్ జిల్లాలో చెల్లికి న్యాయం కావాలంటూ అన్న ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు బయల్దేరిన ఘటనపై హెచ్ఆర్సీ స్పందించింది. చెల్లెలిపై అత్తింటి వేధింపులు తాళలేక స్థానికంగా న్యాయం దొరకడం లేదంటూ దుర్గారావు దిల్లీకి పయనమయ్యాడు. దీనిపై పలు వార్తాకథనాలు రాగా కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు నోటీసులు జారీచేసింది. అధికారులు అప్రమత్తమైన దుర్గారావును కలిసి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.