రాష్ట్రంలో కోడిగుడ్డు ధర ఆకాశన్నంటుతోంది. ఒక్క గుడ్డు ధర రూ.7కు చేరుకుంది. అక్టోబర్‌లో హోల్‌సేల్‌లో రూ.4 ఉన్న గుడ్డు ధర ఏకంగా రూ.6కు అమ్ముడవుతోంది. పెరిగిన కోళ్ల దాణా ఖర్చు, కూలీ ఖర్చులతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూస్తుండగా ఒక్క గుడ్డు రూ.10 అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రభుత్వం హస్టళ్లలోనూ రెండు రోజులకు ఒకసారి ఇవ్వాల్సి గుడ్డు మూడు రోజులకు ఒకసారి ఇస్తున్నట్లు తెలుస్తోంది.