బల పరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే

© ANI Photo

మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే హయాంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే నేడు ఏక్‌నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే వర్గం విజయం సాధించింది. మొత్తం 287 మంది సభ్యులున్న సభలో 164 ఓట్ల మెజారిటీతో శివసేన రెబల్, బీజేపీ అలియాన్స్ విజయం సాధించింది. అటు శివసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏక్‌నాథ్ షిండే నియమితులయ్యారు.

Exit mobile version