ఎలాంటీ నోటీసులు అందలేదు: కవిత

Courtesy Twitter: kavitha Kalvakuntla

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు ఈడీ నుంచి ఎలాంటీ నోటీసులు అందలేదని చెప్పారు. కొన్ని మీడియా ఛానెళ్లు దురుద్దేశంతో కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. నిజాల్ని చూపించేందుకు మీడియా సమయం కేటాయించుకోవాలని ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ కేసులో దేశవ్యాప్తంగా ఈడీ అధికారులు 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పలువురికి నోటీసులు జారీ చేశారు.

Exit mobile version