తెలంగాణలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో లేదని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటివి వచ్చినా నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. ఇటీవల అధ్యక్షుడి మార్పు ఉంటుందని ప్రచారం జరిగింది. అసలు అలాంటి చర్చ జాతీయ నేతల మధ్య జరగలేదట. నాయకత్వ మార్పు గురించి బీఆర్‌ఎస్ కావాలనే ప్రచారం చేస్తోందని అభిప్రాయపడ్డారు.