హర్యానాలోని పానిపట్ జిల్లాలో నివసిస్తున్న ఒంటరి మహిళకు విద్యుత్ శాఖ వారు షాకిచ్చారు. ఏకంగా రూ.21లక్షలకు పైగా కరెంటు బిల్లును ఆమెపై మోపారు. దీంతో ఇంత బిల్లును కట్టలేనంటూ.. బదులుగా తన ఇంటిని తీసుకోండంటూ ఆ వృద్ధురాలు వినూత్నంగా నిరసన తెలిపింది. అంతేగాకుండా బ్యాండుమేళం వాయిస్తూ, మిఠాయిలు పంచుతూ తన నిరసనను వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయం స్థానికంగా వైరల్ అయింది. ఇంత కరెంటు బిల్లు ఎలా వేస్తారంటూ స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. అయితే, ఇలా ఆ వృద్ధురాలికి గతంలోనూ భారీగా బిల్లు వేశారంట.
వృద్ధురాలికి రూ.21లక్షల కరెంటు బిల్లు!

© Envato