విద్యుత్ కొనుగోలు రేటు పెరిగినప్పుడు వినియోగదారుడిపై పెరిగిని ధరలు వెంటనే వేసేలా విద్యుత్ కమిషన్ ఫార్ములా రూపొందించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది. అదనపు భారాన్ని వినియోగదారుల బిల్లుల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వినియోగదారులకు ఇబ్బందులు సృష్టించకుండా ఇంధన, విద్యుత్ ఛార్జీలు లెక్కించి వారి బిల్లుల్లో చేర్చాలని సూచించింది. 3 నెలల్లోగా ఫార్ములా రూపొందించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది.