ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. స్పేస్ ఎక్స్, టెస్లా, ది బోరింగ్ కంపెనీ, స్టార్‌లింక్ వంటి ప్రాజెక్టులకు ఆయన అధిపతి. అయితే 2021వ సంవత్సరంలో అత్యధికంగా జీతం పొందిన సీఈఓల జాబితాలో ఎలాన్ మొదటి స్థానంలో నిలిచాడు. సుమారు 23.5 బిలియన్ డాలర్లు(రూ.1,82,576 కోట్లు) ఆయన శాలరీగా తీసుకున్నట్లు ఫార్చ్యూన్ 500 వెల్లడించింది. అతని తరువాతి స్థానంలో ఆపిల్ సీఈఓ టీం కుక్, సత్యనాదెళ్ళ, రీడ్ హాస్టింగ్స్(నెట్‌ఫ్లిక్స్ సీఈఓ) ఉన్నారు.