టెస్లా, స్పేస్ఎక్స్ CEO ఎలాన్ మస్క్ 2024 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అవుతాడని టెస్లారాటి నివేదిక అంచనా వేసింది. 2024 వరకు 52 ఏళ్ల వయస్సులో 1.38 ట్రిలియన్ డాలర్ల నికర విలువను సాధించగలడని పేర్కొంది. మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు. గత ఏడాది అమెజాన్ జెఫ్ బెజోస్‌ను అధిగమించి తొలి స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం మస్క్ నికర విలువ 260 బిలియన్ల డాలర్లకు పైగా ఉండగా, బెజోస్ 190 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017 నుంచి మస్క్ సంపద వార్షిక సగటు 129 శాతం పెరుగుతున్నట్లు ప్రకటించింది.