ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తను చేసే పని ఏదైనా దానిని ట్విట్టర్ ద్వారా తన ఫాలోవర్లకు తెలుపుతూ ఉంటాడు. అయితే తాజాగా అతడిని ‘వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చి, తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్‌ను ప్రారంభిస్తారా’ అని ఓ ఫాలోవర్ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మస్క్ ‘నేను దాని గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాను’ అని బదులిచ్చాడు. ఈ మేరకు ఓ పోల్ కూడా నిర్వహించాడు. ఈ పరిణామాలను గమనిస్తే మస్క్ త్వరలోనే ట్విట్టర్‌కు పోటీగా ఓ యాప్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ‘ట్రూత్’ పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.