అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధాన్ని ఎత్తివేస్తానని ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు. ఇటీవల 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్, ట్రంప్ తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకోకుండా నిషేధించడం నైతికంగా తప్పు అని పేర్కొన్నాడు. మొదటినుంచి ఈ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న మస్క్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. 2021 జనవరి 6న యుఎస్ క్యాపిటల్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ట్రంప్ హింసను ప్రేరేపిస్తున్నారంటూ ఆయన ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధించారు.