ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-2022కు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 14వ తేదీన విడుదలవనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లకు అంగీకారం వచ్చిందని తెలిపారు. అధికారుల సానుకూల సమయం, ఎన్ని పరీక్ష కేంద్రాలుండాలి? ఎక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారనే నివేదికను టీసీఎస్ సంస్థ ఇస్తుందని తెలిపారు. ఆ సంస్థ నివేదిక ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.