• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెటర్నిటీ లీవ్‌లో ఉద్యోగి.. లేఆఫ్ విధించిన మెటా

    కంపెనీల లేఆఫ్‌ల వల్ల చాలామంది ఉద్యోగులు వినూత్న అనుభవాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా మాతృత్వ సెలవుల్లో ఉన్న ఓ ఉద్యోగిపై లే ఆఫ్ పిడుగు పడింది. ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం మెటా తీసేసిన 10,000 మందిలో సారా ఒకరు. మూడేళ్లుగా మెటాలో రిక్రూటింగ్ టీంలో పనిచేస్తున్నారు. తాజాగా లింక్‌డ్‌ఇన్‌లో సారా తన అనుభవాన్ని పంచుకున్నారు. లేఆఫ్‌ల వల్ల తన మెటర్నిటీ సెలవులు అర్ధంతరంగా ముగిశాయని చెప్పుకొచ్చారు. టాప్ పెర్ఫార్మర్లను కూడా కంపెనీ నుంచి తొలగిస్తుండటంపై సారా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలోనూ మెటర్నిటీ లీవ్‌లో ఉన్న ఉద్యోగిని మెటా తొలగించడం గమనార్హం.